అలనాటి రామచంద్రుడు చిత్రం నుండి నాన్న పాట విడుదల

అలనాటి రామచంద్రుడు చిత్రం నుండి నాన్న పాట విడుదల

కృష్ణ వంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. ఈ చిత్రం నుంచి ‘నాన్న’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు.  దర్శకుడు హను రాఘవపూడి ఈ పాటను లాంచ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. శశాంక్ తిరుపతి కంపోజ్ చేసిన ఈ హార్ట్ టచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెలోడీ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘జోలాలిలా ఓ హాయిలా...  నువ్వే నాన్న...  నీ పాటే అలై, నీ మాటై కథై, నను లాలించగా..’ అంటూ చిలుకూరి ఆకాష్ రెడ్డి లిరిక్స్ రాశాడు. అంజనా బాలకృష్ణన్, శ్రాగ్వి పాడిన విధానం ఆకట్టుకుంది.  బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.