మన కుర్రోళ్లు.. రోజుకు 14 గంటలు పని చేయాలి: ఇన్ఫోసిస్ నారాయణ సంచలన వ్యాఖ్యలు

మన కుర్రోళ్లు.. రోజుకు 14 గంటలు పని చేయాలి: ఇన్ఫోసిస్ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఐటీ ఉద్యోగం అంటే.. వైట్ కాలర్ జాబ్. రోజుకు ఎనిమిది గంటల పని.. వారానికి ఐదు రోజుల వర్క్.. వారానికి 40 గంటల వర్కింగ్ అవర్స్.. దీనికితోడు ఆ లీవ్స్.. ఈ లీవ్స్ అంటూ బోలెడు సెలవులు.. ఇప్పటి వరకు ఐటీ ఉద్యోగుల వర్కింగ్ కల్చర్ ఇది.. దీనికి భిన్నంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి. 

ప్రస్తుతం దేశంలోని ఐటీ రంగంలో వారానికి 40 గంటలు మాత్రమే ఉంది.. నేటి కుర్రోళ్లు.. యంగ్ ఐటీ ఇంజినీర్స్ వారానికి 70 గంటలు పని చేయాల్సిన అవసరం ఉందని తన మనసులోని మాట చెప్పారు. వారానికి 70 గంటలు అంటే.. ఐదు రోజుల లెక్కన రోజుకు 14 గంటలు అన్నమాట.. ఇంతకీ నారాయణమూర్తి 70 గంటల వర్క్ పై వ్యాఖ్యలు చేయటానికి కారణాలు ఏంటో చూద్దాం...

గత రెండు మూడు దశాబ్దాలుగా వేగంగా ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాలంటే.. భారత్ ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా.. భారత్ లోని యువత కృషి ఎంతో అవసరం.. అందుకు మన కుర్రోళ్లు వారానికి 70 రోజులు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అన్నారు. అంటే రోజుకు వారానికి ఐదు రోజుులు  పనిచేసే  మన కుర్రాళ్లు అదనంగా రోజుకు కనీసం 14 గంటలు పనిచేయాలని ఓ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తన మనసులో మాటను తెలిపారు. 

భారతదేశంలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని.. చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశంతో పోటీ పడాలంటే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ పనిచేసినంతగా.. భారతీయ యువత ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉందని నారాయణమూర్తి అన్నారు.