మరికల్, వెలుగు : నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంటలో రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో పోలైన ఓట్లను రీ కౌంటింగ్చేయాలని బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పద్మమ్మ కోరారు. మంగళవారం హైదరాబాద్లోని ఎన్నికల కమిషన్కు ఆమె ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ మద్దతుదారైన తిరుపతమ్మ ఒక్క ఓటుతో గెలుపొందినట్లు, ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని పద్మమ్మ కోరారు. పోలైన ఓట్లను మరోసారి లెక్కించి, ఎవరికి ఎన్ని వచ్చాయో తేల్చాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
