కోడ్ ఉల్లంఘించిన ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

కోడ్ ఉల్లంఘించిన ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
  • ఎన్నికల అధికారికి బీజేపీ నాయకుల ఫిర్యాదు

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. బుధవారం పట్టణంలో క్రిస్టియన్లకు చర్చిని కట్టిస్తామని  స్వయంగా ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ ను ఎమ్మెల్యే లెక్క చేయడంలేదని, ఇప్పటికే పలు శంకుస్థాపనలు చేయగా, ఓట్ల కోసం వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ నాయకులు, సంగప్ప, కోణం విఠల్ ఆరోపించారు. ఈ విషయమై బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మారుతి రెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంటనే భూపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.