శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడికి నార్కో టెస్ట్..కస్టడీ పొడిగింపు

శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడికి నార్కో టెస్ట్..కస్టడీ పొడిగింపు

శ్రద్ధ వాకర్ హత్యకేసు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను నార్కో టెస్ట్ చేయడానికి ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. ఇవాళ్టితో అతడి కస్టడీ ముగియడంతో పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. మరో 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం ఐదురోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్వెస్టిగేషన్కు నిందితుడు సహకరించట్లేదని నార్కో టెస్టుకు అనుమతించాలన్న పోలీసుల వాదనకు కోర్టు ఒకే చెప్పింది. 

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో అఫ్తాబ్‌ మే 18న శ్రద్ధాను చంపేశాడు. ఆ మరుసటి రోజు పది గంటల పాటు శ్రమించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. 35 ముక్కలను 18 ప్యాకుల్లో అమర్చి.. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా తండ్రి నవంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పటివరకూ శ్రద్ధాకు చెందిన 13 ఎముకలను మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు.