పాతికేళ్లలో రియల్‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌.. రూ.476 లక్షల కోట్లకు

పాతికేళ్లలో రియల్‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌.. రూ.476 లక్షల కోట్లకు
  • దేశ జీడీపీ 30–-40 ట్రిలియన్ డాలర్లకు       
  • 23 కోట్ల ఇండ్లు అవసరవుతాయి
  • కమర్షియల్‌‌‌‌, ఆఫీస్‌‌‌‌, ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌మెంట్స్​కు కూడా ఫుల్ గిరాకీ
  • హైదరాబాద్‌‌‌‌లో రిపోర్ట్‌‌‌‌ విడుదల చేసిన నరెడ్కో, నైట్‌‌‌‌ఫ్రాంక్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దేశ రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు తిరుగుండదని, జీడీపీ పెరిగే కొద్దీ సెక్టార్ మరింతగా విస్తరిస్తుందని  నైట్ ఫ్రాంక్‌‌‌‌, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌‌‌‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) భావిస్తున్నాయి.  రియల్ ఎస్టేట్‌‌‌‌ సెక్టార్  మార్కెట్ సైజ్‌‌‌‌ 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్ల (రూ.476 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని,  జీడీపీలో  ఈ సెక్టార్ వాటా 15.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.  ప్రస్తుతం ఈ నెంబర్ 7.3 శాతంగా ఉంది.   ఈ రెండు సంస్థలు కలిసి శనివారం  హైదరాబాద్‌‌‌‌లో  ‘ఇండియా రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌: విజన్‌‌‌‌ 2047’ రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేశాయి.  రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో రెసిడెన్షియల్ సెగ్మెంట్ వాటా మరింత పెరుగుతుందని ఈ రిపోర్ట్ పేర్కొంది.  ‘2047 నాటికి అంటే ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అయ్యేటప్పటికి దేశ ఎకానమీ 30–40 ట్రిలియన్ డాలర్ల (రూ.3,280 లక్షల కోట్ల)కు  పెరుగుతుంది’ అని వివరించింది.  

ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు గత 20 ఏళ్లుగా నిలకడగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది 2023 నాటికి 5.6 బిలియన్ డాలర్ల  (రూ.45,900 కోట్ల)  ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు వచ్చాయని, ఇంకో 25 ఏళ్లలో ఈ పెట్టుబడుల విలువ 54.3 బిలియన్ డాలర్ల (రూ.4.45 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని నైట్‌‌‌‌ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. ఏడాదికి 9.5 గ్రోత్‌‌‌‌ నమోదు చేస్తుందని అంచనా వేస్తోంది. ‘దేశ ఎకానమీ 2047 నాటికి భారీగా విస్తరిస్తుంది.   ఈ గ్రోత్‌‌‌‌లో రియల్ ఎస్టేట్ సెక్టార్ పాత్ర కీలకంగా ఉంటుంది.  

రెసిడెన్షియల్‌‌‌‌,  కమర్షియల్‌‌‌‌, వేర్‌‌‌‌‌‌‌‌హౌసింగ్‌‌‌‌, ఇండస్ట్రియల్‌‌‌‌ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ అన్ని సెగ్మెంట్‌‌‌‌లలో  కొన్ని రెట్ల గ్రోత్‌‌‌‌ కనిపిస్తుంది. ఎకానమీ  పెరుగుతుండడంతో ప్రజల అవసరాలను తీర్చడానికి రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా అంతే వేగంగా  విస్తరిస్తుంది’ అని  నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బందెల్కర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం, వచ్చే 25 ఏళ్లలో 23 కోట్ల ఇండ్లు అవసరమవుతాయి. అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్‌‌‌‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అలానే మిడ్‌‌‌‌, లగ్జరీ ఇండ్లలో డిమాండ్ కనిపిస్తుంది. తక్కువ ఆదాయం గల  కుటుంబాలు 2047 నాటికి ప్రస్తుతం ఉన్న 43 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతాయి.  ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుండడంతో  రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ వేగంగా విస్తరిస్తుందని  నరెడ్కో వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ హీరానందానీ అన్నారు. ‘ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ మెరుగవుతోంది.  ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌‌‌‌గా ఉంది.  దేశ వినియోగం, వివిధ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ మోడల్స్ అందుబాటులో ఉండడంతో  రియల్ ఎస్టేట్ సెక్టార్ భారీగా పెరుగుతుంది.  జీడీపీ పెరిగే కొద్దీ   కమర్షియల్, ఇండస్ట్రియల్‌‌‌‌ రియల్‌‌‌‌ ఎస్టేట్ సెగ్మెంట్లకు డిమాండ్ క్రియేట్ అవుతుంది. గ్రేడ్ ఏ అసెట్లలో ఇన్వెస్ట్‌‌‌‌ చేసేందుకు గ్లోబల్‌‌‌‌ ఇన్వెస్టర్లు ముందుకొస్తారు. వీరిని ఆకర్షించడంలో  కొత్తగా పుట్టుకొస్తున్న ఆల్టర్నేటివ్ అసెట్‌‌‌‌ క్లాస్‌‌‌‌లు కీలకంగా పనిచేస్తాయి’ అని వివరించారు.

రైట్స్‌‌‌‌పై పెరుగుతున్న ఫోకస్‌‌‌‌

రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ట్రస్ట్‌‌‌‌ (రైట్స్‌‌‌‌)  మరిన్ని సెగ్మెంట్లకు విస్తరిస్తుందని  నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ అంచనావేస్తోంది. రైట్స్‌‌‌‌ ద్వారా కమర్షియల్ రియల్ ఎస్టేట్ఆస్తుల్లో  డైరెక్ట్‌‌‌‌గా ఇన్వెస్ట్‌‌‌‌ చేయొచ్చు. ఈ ఆస్తులపై వచ్చే ఆదాయం అంటే రెంట్‌‌‌‌లు వంటివి ఇన్వెస్టర్లు షేర్ చేసుకుంటారు. మార్కెట్‌‌‌‌లో మహీంద్రా లైఫ్‌‌‌‌ స్పేస్‌‌‌‌, సన్‌‌‌‌టెక్ రియల్టీ వంటి రైట్స్ అందుబాటులో ఉన్నాయి.  

రెసిడెన్షియల్‌‌‌‌,  వేర్‌‌‌‌‌‌‌‌హౌసింగ్ వంటి సెగ్మెంట్లలో కూడా రైట్స్ వస్తాయని ఈ రిపోర్ట్‌‌‌‌ పేర్కొంది.  ప్రస్తుతం కమర్షియల్‌‌‌‌,  రిటైల్‌‌‌‌ సెగ్మెంట్లలో 8.49 కోట్ల చదరపు మీటర్ల ఆస్తులపై రైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 7.59 కోట్ల చదరపు మీటర్ల ఆస్తులు  ఆఫీస్ సెగ్మెంట్‌‌‌‌కు చెందినవే.  మరో 90 లక్షల చదరపు మీటర్ల్‌‌‌‌ రిటైల్ ఆస్తులపై రైట్స్ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు 2.13 కోట్ల చదరపు మీటర్ల ఆస్తులు కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌లో  ఉన్నాయి. ఇంకో రెండేళ్లలో ఇవి పూర్తవుతాయి.  పనిచేయగలిగే జనాభాలో 69 శాతం మంది వివిధ పనులు చేస్తారని ఈ రిపోర్ట్ పేర్కొంది.