
హైదరాబాద్, వెలుగు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో)ఈ నెల 10–12 తేదీల్లో హైదరాబాద్లో 15వ ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కార్యక్రమం జరుగుతుంది. ఈ షోలో రెసిడెన్షియల్హోమ్స్, ఆఫీసులు, కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీలను ప్రదర్శిస్తారు. షోలో డెవలపర్లు, బిల్డర్లు, ప్రమోటర్లు పాల్గొంటారని నరెడ్కో తెలంగాణ ప్రెసిడెండ్ అధ్యక్షుడు విజయ సాయి చెప్పారు. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ వంటివి లోన్లు ఇవ్వనున్నాయి.