
ప్రధాని నరేంద్ర మోడీ.. మన దేశం నుంచి గత ఏడాది రూ.45వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి చేశామని, ఈ ఏడాది రూ. లక్ష కోట్ల విలువచేసే మొబైల్స్ ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. దేశం నుంచి ఎగుమతి అవుతున్న టాప్ 10 వస్తువుల జాబితాలో మొబైల్ పోన్లు ఉండాలనేది ప్రధాని కోరిక అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు సంబంధించిన చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంటోందట.
భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొబైల్స్ జాబితాలో మొదట యాపిల్, శామ్ సంగ్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇయర్ పాడ్స్, మొబైల్ వేరబుల్స్, హార్డ్ వేర్ వంటి వస్తువులను ఉంచినట్లు తెలుస్తుంది. ఈ కార్యంలో స్థానిక ఉత్పత్తుల్ని ఎక్కువ ప్రోత్సహించనున్నారు. దానికోసం పీఎల్ ఐ పతకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించబోతున్నారు.