మోడీ, జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ సత్తా ఉన్నోళ్లే..

మోడీ, జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ సత్తా ఉన్నోళ్లే..

ఇండియా-చైనా మధ్య వేరే దేశాల జోక్యం అవసరంలే: పుతిన్
 వాళ్లిద్దరూ బాధ్యత ఉన్న లీడర్లు
 సమస్యను వాళ్లే పరిష్కరించుకోగలరు

సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా):ప్రధాని నరేంద్ర మోడీ, చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ చాలా బాధ్యత ఉన్న లీడర్లని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. చైనా–ఇండియా సమస్యలను పరిష్కరించుకోగలిగే సత్తా వారిద్దరికీ ఉందని, ఇందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న క్వాడ్ అలయెన్స్ ను ‘ఏసియన్ నాటో’ కూటమి అంటూ రష్యన్ ఫారిన్ మినిస్టర్ సెర్గీ లారోవ్ ఇటీవల విమర్శించారు. దీనిపై శనివారం పీటీఐ వర్చువల్ ఇంటర్వ్యూలో పుతిన్ స్పందించారు. రష్యా, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నందున ఇండియాతో రక్షణ  ఇతర రంగాల్లో కోఆపరేషన్ తగ్గుతుందన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. ఇండియాతో తమ పార్ట్ నర్షిప్ నమ్మకంతో ముందుకు వెళుతోందని, అడ్వాన్స్ డ్ వెపన్స్, టెక్నాలజీల్లో మరింత సహకారం ఉంటుందన్నారు. చైనాతోనూ సంబంధాల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారు.  ‘‘మేం క్వాడ్ కూటమిలో చేరలేదు. అలాగే క్వాడ్ లో చేరిన ఇతర దేశాల నిర్ణయాలను మేం అసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ దేశంతో లేదా కూటమితో చేరాలన్న నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి దేశానికీ ఉంది” అని పుతిన్ తెలిపారు. ఈ కూటమి వల్ల చైనా, ఇండియాతో తమ భాగస్వామ్యానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవన్నారు. ఈ మూడు దేశాలు బ్రిక్స్ కంట్రీస్ లో భాగంగా కలిసి పని చేస్తున్నాయని గుర్తు చేశారు. అయితే అమెరికా మాత్రం అయినదానికి, కాని దానికి తమపై ఆంక్షలు విధిస్తోందని తప్పుపట్టారు. అమెరికా తన కరెన్సీని పొలిటికల్ వెపన్ గా వాడుతోందని విమర్శించారు.