మహిళల భద్రత చాలా ముఖ్యం.. ఇలాంటి నేరాలు చేస్తే ఎవరినైనా వదలం: ప్రధాని మోదీ

మహిళల భద్రత చాలా ముఖ్యం.. ఇలాంటి నేరాలు చేస్తే ఎవరినైనా వదలం: ప్రధాని మోదీ

మహిళలపై జరిగే నేరాలు క్షమించరానివని.. దేశంలో మహిళలకు భద్రత చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోల్‌కతా RG కార్ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ ని ఓ వ్యక్తి అత్యాచారం, హత్య చేశాడు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ప్రధాని మోదీ మహిళల భద్రత గురించి మాట్లాడారు. మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో లఖపతి దీదీ సమ్ముళనంలో మహిళలపై జరుగుతున్న నేరాలు క్షమించరానివని అన్నారు. అలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. 

కోల్ కతా ఘటనలో దోషులు ఎవ్వరైనా సరే వారిన విడిచిపెట్టకూడదని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. స్వాతంత్ర్యం వచ్చిన నుంచి గతపదేళ్ల వరకు గత ప్రభుత్వాలు మహిళల భద్రతకు ఏ చర్యలు తీసుకుందో.. అంతకంటే ఎక్కువ ఎన్డీయే ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీపై దృష్టి పెట్టి.. చాలా చర్యలు తీసుకుందని గుర్తు చేశారు ప్రధాని. 2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25వేల కోట్ల కంటే తక్కువ రుణాలు ఇచ్చారని.. కానీ గత 10 సంవత్సరాలలో రూ.9 లక్షల కోట్లు స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చామని మోదీ చెప్పారు.