నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్ ఎస్సై రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా ఎస్సైపై పలువురు ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన అధికారులు నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, నర్సంపేటలో గతంలో సీఐలుగా పనిచేసిన రమణమూర్తి, రఘుపతి రెడ్డిల పనితీరు కూడా వివాదాస్పదంగా మారింది. అప్పట్లో వారిని సీపీ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేశారు. తాజాగా ఎస్సై రవికుమార్‌పై కూడా సస్పెన్షన్ వేటు పడడంతో పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

