‘లజ్జా’ డైరెక్టర్ కొత్త సినిమా షురూ.. 1980 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో “ప్రభుత్వ సారాయి దుకాణం”

‘లజ్జా’ డైరెక్టర్ కొత్త సినిమా షురూ.. 1980 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో  “ప్రభుత్వ సారాయి దుకాణం”

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నరసింహ నంది రూపొందించిన తాజా చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’.ఆర్.విక్రమ్, సదన్ హాసన్, వినయ్, నరేష్ రాజ్, అదితి మైకేల్, శ్రీలు దాసరి, పృథ్వీ ప్రధాన పాత్రలు పోషించారు.  దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మించారు.

ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించగా.. నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు సముద్ర అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్‌‌‌‌ చెప్పారు. దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ ‘షేక్స్‌‌‌‌పియర్ కథలోని పాత్రల ప్రేరణతో, 1980ల నాటి తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా దీన్ని రూపొందించాం.

►ALSO READ | మన చుట్టూ జరుగుతున్న కథలా.. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ మూవీ: డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

మనిషిలోని పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ప్రేమ సహా వివిధ కోణాలను ఇందులో చూపించబోతున్నాం’ అని చెప్పారు. త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడే ఈ నరసింహ నంది.