సీల్‌‌‌‌‌‌‌‌తో సిత్రమైన ప్రయోగం

సీల్‌‌‌‌‌‌‌‌తో సిత్రమైన ప్రయోగం

అంటార్కిటిక్‌‌‌‌‌‌‌‌లో సముద్ర ప్రవాహాల స్టడీకి నాసా కొత్త ట్రిక్‌‌‌‌‌‌‌‌

సీల్‌‌‌‌‌‌‌‌ తలకు సెన్సర్లు అమర్చి సైంటిస్టుల రీసెర్చ్‌‌‌‌‌‌‌‌

సముద్రంలోని వేడి లోతు నుంచి పైకీ వస్తుందని వెల్లడి

సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్‌‌‌‌‌‌‌‌ నాసా. చంద్రునిపై మనిషి కాలు మోపడం మొదలుకొని ఈమధ్య నెఫ్ట్యూన్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఉన్న ఆస్టరాయిడ్‌‌‌‌‌‌‌‌ బెల్టులోని ఆస్టరాయిడ్‌‌‌‌‌‌‌‌ బెన్నూపై పరిశోధనలకు ఉపగ్రహాన్ని పంపిన రికార్డు అమెరికా అంతరిక్ష సంస్థ సొంతం. ఇలాంటి వెరైటీ ప్రయోగాలు చేసే నాసా.. ఈమధ్య ఓ కొత్త ప్రయోగం చేసింది. భూ వాతావరణం మార్పు గురించి కచ్చితంగా తెలుసుకోవడానికి లోతైన సముద్ర ప్రవాహాలపై రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ చేసింది. దీనికోసం డ్రోన్లు, ఏఐ మెషీన్లు వాడిందనుకుంటున్నారా? అంతకుమించిన టెక్నాలజీ వాడింది. అది కూడా ఖర్చు లేకుండా. ఎలాగనుకుంటున్నారు? ప్రయోగానికి సీల్‌‌‌‌‌‌‌‌ను వాడుకుంది మరి. ఇందుకోసం సీల్‌‌‌‌‌‌‌‌కు ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌ పరికరాన్ని అమర్చింది. దాని సాయంతో సముద్రాల్లో వేడిని అంచనా వేసింది.

కొత్త విషయం తెలుసుకున్నరు

సముద్రాలను హీట్‌‌‌‌‌‌‌‌ సింక్స్‌‌‌‌‌‌‌‌ అంటుంటారు. అవి ఎంత చల్లగా ఉంటే అంత ఎక్కువ వేడిని గ్రహిస్తుంటాయి. సముద్రం ఉపరితలం నుంచి లోతుల్లోకి వేడి ప్రవహిస్తుందని ఇప్పటివరకు సైంటిస్టులకు తెలుసు. అయితే ఈమధ్య సముద్రం అడుగు భాగంలో వేడి పెరగడం వల్ల అవి టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ను గ్రహించలేకపోతున్నాయి. దీంతో అసలు సముద్రంలో వేడి ఎలా ప్రవహిస్తుందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ప్రయోగం చేశారు. దక్షిణార్ధ గోళంలో వేడిని కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసే అంటార్కిటిక్‌‌‌‌‌‌‌‌ సర్కమ్‌‌‌‌‌‌‌‌పోలార్‌‌‌‌‌‌‌‌ ప్రవాహాలపై ప్రయోగాన్ని స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రస్తుత సిద్ధాంతానికి పూర్తి విరుద్ధంగా వేడి ప్రవహిస్తోందని సీల్‌‌‌‌‌‌‌‌ ప్రయోగం ద్వారా తెలుసుకున్నారు. సముద్రం ఉపరితలం నుంచి అడుగుకు వెళ్తున్న వేడి అప్పుడప్పుడు పైకి కూడా వస్తుందని కనుగొన్నారు. ప్రస్తుతమున్న క్లైమేట్‌‌‌‌‌‌‌‌ మోడల్స్‌‌‌‌‌‌‌‌లో ఈ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ లేదని, దీన్ని చేర్చాల్సిన అవసరముందని భావిస్తున్నారు.

సీల్‌‌‌‌‌‌‌‌నే ఎందుకు?

ఎలిఫెంట్‌‌‌‌‌‌‌‌ సీల్స్‌‌‌‌‌‌‌‌ సముద్రంలోనే 10 నెలల వరకు గడుపుతుంటాయి. సముద్ర ఉపరితలం నుంచి రెండు కిలోమీటర్ల లోతులో ఆహారం కోసం వేటాడుతుంటాయి. నెలల తరబడి వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. పడుకున్నప్పుడు కూడా డైవ్‌‌‌‌‌‌‌‌ కొడుతుంటాయి. అందుకే సైంటిస్టులు వీటిని ప్రయోగానికి ఎంచుకున్నారు. 2014లో కెర్గూలెన్‌‌‌‌‌‌‌‌ ఐలండ్‌‌‌‌‌‌‌‌లో ఓ ఆడ సీల్‌‌‌‌‌‌‌‌ను పట్టుకొని సెన్సర్లు పెట్టారు. ఓ హైటెక్‌‌‌‌‌‌‌‌ టోపీలాగా అమర్చారు. 2014 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఆ సీల్‌‌‌‌‌‌‌‌ తన పని మొదలుపెట్టింది. మూడు నెలల్లో 5 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ టైంలో 6,333 సార్లు సముద్రంలోకి డైవ్‌‌‌‌‌‌‌‌ చేసింది. సైంటిస్టులు ఇంతకుముందెన్నడూ కనుక్కోని సమాచారం ఇచ్చింది. మనుషులు గతంలో ఎప్పుడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్లి డేటా అందించింది.