
నాసా సోఫియా టెలిస్కోప్‌తో చేసిన పరిశోధనల్లో వెల్లడి
పారిస్: చందమామపై ఇంతకుముందు అంచనా వేసిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా నీళ్లున్నాయని రెండు సర్వేలు వెల్లడించాయి. చంద్రునిపై సూర్యకాంతి పడే ప్రదేశంలో నీటి అణువులు, కోల్డ్ ట్రాప్స్‌లో కూడా నీరు మంచు రూపంలో ఉందని వివరించాయి. ఈ రెండు రీసెర్చ్‌లు నేచర్ ఆస్ట్రానమీలో ఇటీవల పబ్లిష్ అయ్యాయి. మూన్‌పై నీరులేదని దశాబ్దం క్రితం దాకా అనుకున్నారు. అయితే కొన్నేళ్లుగా చేస్తున్న రీసెర్చ్‌లలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేయడం ద్వారా నీటి ఆనవాళ్లను కనుగొన్నా నీరు, హైడ్రాక్సిల్ మధ్య తేడాను గుర్తించలేకపోయారు. ఇప్పుడీ రెండు రీసెర్చ్‌లు నీటి ఆనవాళ్లపై స్పష్టతనిచ్చాయి. నాసాకు చెందిన స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ ఆస్ట్రానమీ(సోఫియా) ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్ ద్వారా రీసెర్చర్లు చంద్రుని ఉపరితలాన్ని పక్కాగా స్కాన్ చేసి ఈ పరిశోధన చేశారు.
చంద్రుని వాతావరణం తట్టుకునే ప్రాంతాల్లో..
చంద్రుని వాతావరణాన్ని తట్టుకునే ప్రాంతాల్లో నీళ్లు ఉండొచ్చని రీసెర్చర్లు చెప్పారు. మరిన్ని పరిశోధనలు చేస్తే నీటి ఆనవాళ్లపై స్పష్టత వస్తుందన్నారు. చంద్రుని ధృవ ప్రాంతాల్లో ఆగాథాల్లో(క్రేటర్స్) వాటర్ ఐస్ ఉందో లేదో అనే అంశంపైనా పరిశోధన చేసిన రీసెర్చర్లు.. చంద్రునిపై లక్షలాది చిన్న క్రేటర్స్ ఉన్నట్టు గుర్తించారు. వాటిల్లో వాటర్ ఐస్
ఉందంటున్నారు.
For More News..