సూర్యుడికి ఎదురొచ్చిన శుక్రుడు

సూర్యుడికి ఎదురొచ్చిన శుక్రుడు

కణకణ మండే అగ్ని గోళం సూర్యుడు. నిప్పులు కక్కే ఆ మహా నక్షత్రం ముందు.. ఏ గ్రహమైనా చిన్నబోవాల్సిందే. అందుకు నిలువుటద్దం పట్టేలా ఉన్న ఓ ఫోటోను ‘నాసా’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మంగళవారం ఉదయం షేర్ చేసింది. దీన్ని నిశితంగా పరిశీలిస్తే.. సూర్యుడికి ఎడమ వైపున ఎగువ భాగంలో ఓ నల్లటి మచ్చలాంటి ఆకారం కనిపిస్తుంది. అది మచ్చ కాదు..  శుక్ర గ్రహం!!  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NASA (@nasa)

దాదాపు పదేళ్ల క్రితం సూర్యుడి ముందు భాగం నుంచి ఈవిధంగా శుక్రుడు గమనం సాగించాడని, మళ్లీ ఇప్పుడు అదే విధమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతమైందని నాసా తెలిపింది. 2010 సంవత్సరం నుంచి సూర్యుడి చుట్టూ చక్కర్లు కొడుతున్న నాసా వ్యోమనౌక ‘సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ’ (ఎస్డీవో) ఈ ఫోటోను తీసి భూమికి పంపించింది.  సూర్యుడి ఎదుటి నుంచి శుక్రగ్రహ గమనం సాగించడం చాలా అరుదని, మరో వందేళ్ల తర్వాతే (దాదాపు 2117 సంవత్సరంలో) ఇలాంటి సీన్ ను చూసే అవకాశం కలుగుతుందని నాసా తెలిపింది.గతంలో 2004, 2012 సంవత్సరాల్లో ఈ తరహాలో సూర్యుడికి శుక్రగ్రహం ఎదురొచ్చిందని గుర్తుచేసింది.