PAK vs NZ: బుమ్రాను గుర్తు చేశాడుగా: పాక్ బౌలర్ స్టన్నింగ్ యార్కర్

PAK vs NZ: బుమ్రాను గుర్తు చేశాడుగా: పాక్ బౌలర్ స్టన్నింగ్ యార్కర్

ప్రపంచ క్రికెట్ లో యార్కర్లంటే మొదటగా గుర్తుకొచ్చేది టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా. తనదైన బౌలింగ్ తో పదునైన యార్కర్లు సంధిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లపై దారుణంగా విరుచుకుపడతాడు. బుమ్రాకు పోటీగా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నజీమ్ షాకు పేరుంది. అందుకు తగ్గట్టుగానే ఒక అదిరిపోయే యార్కర్ వేసి న్యూజిలాండ్ బ్యాటర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

ప్రస్తుతం పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 21) జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో నజీమ్ షా యార్కర్ బంతితో బ్యాటర్ ను షాక్ కు గురి చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఐదో బంతిని నజీమ్ 142 కిలోమీటర్ల వేగంతో యార్కర్ విసిరాడు. ఈ బంతిని అంచనా వేయలేకపోయిన కివీస్ బ్యాటర్ రాబిన్సన్ బౌల్డయ్యాడు.

ముందుకొచ్చి ఆడదామనుకుంటే యార్కర్ ధాటికి ఏమీ చేయలేకపోయాడు.ఈ పాక్ బౌలర్ వేగానికి మిడిల్ వికెట్ పూర్తిగా కిందపడిపోయింది. ఈ ఒక్క వికెట్ మినహాయిస్తే ఈ మ్యాచ్ లో పాక్ కు ఎలాంటి ఆనందం దక్కలేదు. బ్యాటింగ్, బౌలింగ్ లో చెలరేగడంతో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఛేజింగ్ లో మరో 9 బంతులు మిగిలి ఉండగానే కివీస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.