నేను నేటి మహిళను : ఆర్టీసీ ఫస్ట్ మహిళా బస్సు డ్రైవర్

నేను నేటి మహిళను : ఆర్టీసీ ఫస్ట్ మహిళా బస్సు డ్రైవర్

నాసిక్ నుంచి సిన్నార్ మార్గంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC)కి బస్సు నడిపిన మొదటి మహిళగా మాధవి సాల్వే చరిత్ర సృష్టించింది. రాష్ట్ర ప్రజా రవాణా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన ఆరుగురు మహిళలు జూన్ 6,7 తేదీలలో MSRTCలో బస్ డ్రైవర్లు-కమ్-కండక్టర్లుగా చేరారు.

మాధవి ప్రయాణం

త్రయంబకేశ్వర్ తాలూకాలోని మహిరవాణి గ్రామానికి చెందిన 34 ఏళ్ల ఇద్దరు పిల్లల తల్లి మాధవి సాల్వే.. 2016 నుంచి తేలికపాటి కమర్షియల్ వెహికిల్ ను నడుపుతున్నారు. సిన్నార్‌లోని MSRTC డిపోలో తన సహోద్యోగుల నుంచి తనకు లభించిన సాదర స్వాగతం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బస్సు డ్రైవర్‌గా మారడానికి సాల్వే తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. బస్సులు నడపడం పట్ల ఆమెకున్న అభిరుచి ఆమెను ఆ అడ్డంకులను అధిగమించేలా చేసింది. కొంతమంది స్నేహితులు, బంధువుల నుంచి పలు అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె తన కుటుంబసభ్యుల మద్దతుతో తన కలను నెరవేర్చుకుంది.

MSRTC రిక్రూట్‌మెంట్

2019లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో 206 మంది మహిళా డ్రైవర్లు అర్హత సాధించగా, వారిలో ఇప్పటివరకు 28 మందిని నియమించారు. వారి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ 2019లో ప్రారంభమైంది. ఈ మహిళలు MSRTC బస్సులలో కఠినమైన శిక్షణ, టెస్టులలో పాల్గొన్నారు కూడా. 16 వేల కంటే ఎక్కువ బస్సులను కలిగి ఉన్న MSRTC.. ఇప్పటికే 5,500 మందికి పైగా మహిళా కండక్టర్లను కలిగి ఉంది. మొత్తం 12 మంది మహిళా డ్రైవర్లను నియమించారు. వీరిలో సిన్నార్ డిపోలో నలుగురు, పింపాల్‌గావ్ డిపోలో ముగ్గురు, పేత్ డిపోలో ఇద్దరు, నాసిక్ జిల్లాలోని లాసల్‌గావ్, పేథ్, కల్వాన్ డిపోల్లో ఒక్కొక్కరు చొప్పున సేవలందిస్తున్నారు. వారు జూన్‌లో అధికారికంగా సర్వీసుల్లో చేరారు. ఇప్పుడు "ప్రవశ్యాంచ్య సేవాతి" (ప్రయాణికుల సేవ కోసం) నినాదంతో ప్రయాణికులకు సగర్వంగా సేవలందిస్తున్నారు.

https://twitter.com/priyapandey1999/status/1666827745341603841