నాట్కో క్యూ1 రెవెన్యూ రూ. 1,141 కోట్లు

నాట్కో క్యూ1 రెవెన్యూ  రూ. 1,141 కోట్లు

హైదరాబాద్, వెలుగు: నాట్కో ఫార్మా లిమిటెడ్​కు క్యూ1 లో రూ. 1,140.50 కోట్ల రెవెన్యూపై రూ. 420.30 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ1 తో పోలిస్తే నికర లాభం 31.20 శాతం ఎగసింది. జూన్​ క్వార్టర్లో ఫార్ములేషన్​ ఎగుమతులతో పాటు, డొమెస్టిక్​ బిజినెస్​ కూడా మంచి పెర్​ఫార్మెన్స్​ కనబరిచినట్లు నాట్కో ఫార్మా తెలిపింది. సబ్సిడరీల సేల్స్​ కూడా నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. ఫార్ములేషన్స్​ ఎగుమతులు జూన్​ క్వార్టర్లో రూ. 884.20 కోట్లకు, డొమెస్టిక్​ పార్ములేషన్స్​ రూ. 132.40 కోట్లకు పెరిగాయని వెల్లడించింది. పేటెంట్​ లిటిగేషన్​ కేసు కోసం రూ. 51 కోట్లను ప్రొవిజన్​ చేసినట్లు వివరించింది. ఉద్యోగులకు స్పెషల్​ ఇన్సెంటివ్స్​ కింద రూ. 17 కోట్లు కేటాయించినట్లు నాట్కో ఫార్మా రెగ్యులేటరీ ఫైలింగ్​లో వెల్లడించింది. ఒక్కో షేర్​కు రూ. 7 చొప్పున ఇంటెరిమ్​ డివిడెండ్​ను డైరెక్టర్ల బోర్డు రికమెండ్​ చేసినట్లు తెలిపింది.