నాట్కో ఫార్మా లాభం రూ. 668 కోట్లు

నాట్కో ఫార్మా లాభం రూ. 668 కోట్లు

న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ తో ముగిసిన మొదటి క్వార్టర్​లో నాట్కో ఫార్మా కన్సాలిడేటెడ్​ నికర లాభం 59 శాతం పెరిగి రూ. 668 కోట్లకు చేరుకుంది.  గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ కాలానికి కంపెనీ రూ.420 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.  కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,140 కోట్ల నుంచి రూ.1,363 కోట్లకు పెరిగిందని నాట్కో ఫార్మా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది.  

2024-–25 ఆర్థిక సంవత్సరానికి తమ బోర్డు ఒక్కో షేరుకు రూ.3 చొప్పున మధ్యంతర డివిడెండ్‌‌‌‌ను ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.  బీఎస్‌‌‌‌ఈలో సోమవారం కంపెనీ షేర్లు 3.48 శాతం పెరిగి రూ.1,491.30 వద్ద ముగిశాయి.