
69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ను గురువారం(ఆగస్టు 24) సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరగనున్న విలేకరుల సమావేశంలో ఈ అవార్డ్స్ విజేతలను ప్రకటించనున్నారు జ్యురీ. ఈసారి నేషనల్ అవార్డ్స్ కోసం నటీనటుల మధ్య గట్టీ పోటీనే జరగనుంది. కారణం ఈ రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. అందులో సౌత్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అలాగే ఉత్తమ నటి విభాగంలో కంగనా రనౌత్, అలియా భట్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కోలీవుడ్ నుండి సూర్య, మాధవన్జో, జు జార్జ్, టోవినో థామస్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో 2023కు గాను ఎవరు ఉత్తమ నటీనటులుగా అవార్డు అందుకోనున్నారో చూడాలి.