ఇయ్యాళ దోమల దినోత్సవమట.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

ఇయ్యాళ దోమల దినోత్సవమట.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

వైరల్ వ్యాధి డెంగ్యూపై అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వ ప్రణాళికలు, వ్యూహాలను చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తుండగా.. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన ఉద్దేశం. సాధారణంగా డెంగ్యూ వ్యాధి ఏడిస్ దోమ కుట్టడం వలన వస్తుంది. వర్షాకాలంలో విపరీతంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి..  దేశవ్యాప్తంగా అనేక స్థాయిలలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

కారణం

డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది ఏడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, డెంగ్యూ జ్వరం అనేది ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్య. దాదాపు 4 బిలియన్ల మంది ప్రజలు డెంగ్యూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. డెంగ్యూ ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపించి ఉన్నందున, ప్రజలు వ్యాధి పరిణామాలను, దాని వ్యాప్తిని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

లక్షణాలు

  •     తీవ్ర జ్వరం
  •     తీవ్రమైన తలనొప్పి
  •     వికారం
  •     కీళ్లు, కండరాల నొప్పి
  •     చర్మంపై దద్దుర్లు

 డెంగ్యూ వ్యాధి సాధారణంగా వైరస్ సోకిన 6 రోజుల తర్వాత వ్యాప్తి ప్రారంభమవుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జ్వరం తగ్గిన మొదటి 24-48 గంటలలో తీవ్రమైన డెంగ్యూ సంకేతాలు కనిపిస్తాయి. కడుపు నొప్పి, వాంతులు, చిగుళ్ళు, ముక్కు లేదా మలం నుండి రక్తస్రావం, అలసట, విశ్రాంతి లేకపోవడం వంటివి లక్షణాలుగా ఉండవచ్చు.

నివారణ

మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమలను దూరంగా ఉంచడానికి దోమల నివారణ క్రీములు, స్ప్రేలు, ప్యాచ్‌లు లేదా ఎలక్ట్రానిక్ వేపరైజర్‌లను ఉపయోగించండి. రాత్రిపూట పచ్చిక ప్రదేశాల్లో సంచరించడం మానుకోండి. మీ ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయడం మర్చిపోవద్దు. దోమల వృద్ధిని నిరోధించడానికి, మీ పరిసరాలకు సమీపంలో ఉన్న నీటిని నివారించండి. నిలిచిపోయిన నీరు చేరకుండా నిరోధించండి.

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోండి. మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.