ఉత్తమ తెలుగు సినిమా కలర్ ఫోటో

ఉత్తమ తెలుగు సినిమా కలర్ ఫోటో
  • జాతీయ అవార్డుల్లో  సత్తాచాటిన తెలుగు సినిమాలు
  • 68వ జాతీయ ఫిల్మ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • ఉత్తమ తెలుగు సినిమా కలర్ ఫోటో , నాట్యం మూవీకి 2 అవార్డులు

న్యూఢిల్లీ: 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య , అజయ్ దేవగణ్ అవార్డులు దక్కించుకున్నారు.15 ప్రాంతీయ భాషల్లో అవార్డులు ప్రకటించారు. నాట్యం సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ కొరియోగ్రఫర్ గా సంధ్యారాజు, బెస్ట్ మేకప్ ఆర్టిస్ గా టీవీ రాంబాబుకు అవార్డులు వచ్చాయి. ఉత్తమ తెలుగు సినిమాగా ‘కలర్ ఫోటో’కు అవార్డు దక్కింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ‘అల వైకుంఠపురం’ సినిమాకుగానూ తమన్ కు అవార్డు దక్కింది. అంగ్ సాంగ్ వారియర్ మూవీకి ఉత్తమ నటుడిగా అజయ్ దేవగణ్ ను గుర్తించింది నేషనల్ ఫిల్మ్ అవార్డు జ్యూరీ కమిటీ. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. 

ఉత్తమ తెలుగు సినిమా : కలర్ ఫోటో
మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌ : మధ్యప్రదేశ్‌
ఉత్తమ సంగీత దర్శకుడు :  తమన్‌ (అల వైకుంఠపురములో)
బెస్ట్‌ స్టంట్స్‌ : అయ్యప్పనుమ్‌ కోషియమ్‌
బెస్ట్‌ కొరియోగ్రఫీ : నాట్యం (తెలుగు)

నాన్‌ ఫియేచర్‌ ఫిలింస్‌


బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌ , మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌ , 1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌ (హిందీ)
బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)
బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌ :  సందీప్‌  భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)