నేషనల్‌ గేమ్స్‌ షురూ

నేషనల్‌ గేమ్స్‌ షురూ

అహ్మదాబాద్‌‌‌‌:  దేశంలో ఎంతో మంది లెజెండరీ అథ్లెట్లకు పునాదిగా నిలిచిన ప్రతిష్టాత్మక నేషనల్‌‌ గేమ్స్‌‌ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగొచ్చాయి. గుజరాత్‌‌ ఆతిథ్యం ఇస్తున్న మెగా గేమ్స్ గురువారం అధికారికంగా షురూ అవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌‌ షా గేమ్స్‌‌ను ప్రారంభిస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి 7 వేల పైచిలుకు అథ్లెట్లు బరిలో నిలిచారు. మొత్తం 34 క్రీడలను గుజరాత్‌‌లోని ఆరు నగరాల్లో నిర్వహిస్తారు.

తెలంగాణ నుంచి 230 క్రీడాకారులు బరిలో నిలిచారు. ఈ సారి టాప్5లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు గాయం కారణంగా పోటీలకు దూరంగా ఉంది. అయితే, ఓపెనింగ్‌‌ సెర్మనీకి మాత్రం హాజరవనుంది. స్టార్‌‌ అథ్లెట్లు, క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌‌కు చెందిన పలువురు నటులు కూడా ఈ సెర్మనీలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా, వివిధ ఇంటర్నేషనల్‌‌ టోర్నీల షెడ్యూల్‌‌ దృష్ట్యా పలు క్రీడలు ముందుగానే మొదలయ్యాయి. ఈ సారి యోగసనాకు  నేషనల్​ గేమ్స్​లో చోటు దక్కింది. చివరగా 2015లో కేరళలో నేషనల్​ గేమ్స్​ జరిగాయి.