వరంగల్ NITలో ఫ్యాకల్టీ పోస్టులు.. డిగ్రీ, బిటెక్ చేసినవాళ్ళకి మంచి ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

 వరంగల్ NITలో ఫ్యాకల్టీ పోస్టులు.. డిగ్రీ, బిటెక్ చేసినవాళ్ళకి  మంచి ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT WARANGAL) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టులు: 45. ప్రొఫెసర్ 02, అసోసియేట్ ప్రొఫెసర్ 08, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ –I 08, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్– II 27. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.కాం, బీఎస్సీ, బి.టెక్/ బీఈఈ, ఎంఎస్సీ, ఎంఈ/ ఎం.టెక్, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి:  అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ –II  35 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్– Iకు 40 ఏండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్​కు 45 ఏండ్లు, ప్రొఫెసర్​కు 50 ఏండ్లు ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్​డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.2000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1000.  

లాస్ట్ డేట్: డిసెంబర్ 12. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ వెరిఫికేషన్,  ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.