ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కామారెడ్డి /సిరికొండ/ నిజామాబాద్​టౌన్,  వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హాకీ లెజెండ్​ ధ్యాన్​చంద్ జయంతి సందర్భంగా  ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.  వ్యాయామ ఉపాధ్యాయ సంఘం, హాకీ అసోసియేషన్​ ఆధ్వర్యంలో హాకీ పోటీలు నిర్వహించారు.  డీఈవో రాజు, హాకీ అసోసియేషన్​ ప్రెసిడెంట్ నీల లింగం, అథ్లెటిక్స్​ జిల్లా అధ్యక్షుడు జైపాల్​రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్​రెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు.  హాకీ పోటీల్లో బాల, బాలికల విభాగంలో గర్గుల్​ హై స్కూల్​ఫస్ట్​ ప్లేస్​లో నిలవగా.. దేవునిపల్లి హైస్కూల్ స్టూడెంట్లు సెకండ్  ప్లేస్​లో నిలిచారు. థర్డ్​ప్లేస్​లో కామారెడ్డి హన్మాన్​  హైస్కూల్​ స్టూడెంట్లు గెలుపొందారు. 

సిరికొండలో..

సిరికొండ మండలంలోని తూంపల్లి హైస్కూల్​లో..  సోమవారం హాకీ డే ను ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్​ చంద్ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళి అర్పించారు. వేడుకల్లో భాగంగా స్టూడెంట్లు ‘హాకీ’ ఇంగ్లీష్​అక్షరాల ఆకారంలో కూర్చుని ఆకట్టుకున్నారు.

గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

బోధన్/భిక్కనూరు/ మాక్లూర్, వెలుగు:  గణేశ్, ఉర్సు ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని బోధన్  ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. సోమవారం బోధన్ టౌన్ లోని ఏఆర్​గార్డెన్​లో పీస్​కమిటీ మీటింగ్​ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గణేశ్​మండపాల నిర్వాహకులు అధికారులు సూచించిన రూల్స్​ పాటించాలన్నారు. రూల్స్​క్రాస్​చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీవో రాజేశ్వర్, టౌన్, రూరల్  సీఐలు ప్రేమ్ కుమార్, శ్రీనివాస్, బోధన్ లోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు. 

మండపాల వద్ద నిబంధనలు​పాటించాలి

మండపాల వద్ద రూల్స్​ పాటిస్తూ.. గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకుందామని ఎంపీపీ గాల్​రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలోని  ఎస్వీ గార్డెన్​లో ఎస్సై అనంత్​గౌడ్​ అధ్యక్షతన జరిగిన పీస్​కమిటీ మీటింగ్​కు హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్​మండల ప్రెసిడెంట్​నరసింహారెడ్డి,  తహసీల్దార్​నర్సింలు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. గణేశ్​నవరాత్రి వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని మాక్లూర్ తహసీల్దార్ ​శంకర్ ​సూచించారు. సోమవారం మండల కేంద్రంలో పీస్​ కమిటీ మీటింగ్​ నిర్వహించారు. వివిధ గ్రామాల మత పెద్దలతో చర్చించారు.  రూరల్​ సీఐ నరహరి తదితరులు పాల్గొన్నారు.

రాజాసింగ్​పై పీడీ యాక్టును ఎత్తివేయాలి

కామారెడ్డి /ఆర్మూర్, వెలుగు: గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​పై  అక్రమంగా నమోదు చేసిన పీడీ యాక్ట్ ను ఎత్తి వేయాలని డిమాండ్​ చేస్తూ  సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో హిందూవాహిని ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.  నిజాంసాగర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం  పీడీ యాక్ట్​ను ఎత్తివేయాలని కోరుతూ  అడిషనల్​ కలెక్టర్​, ఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చారు.  ఈ సందర్భంగా హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు సాయికిరణ్ ​మాట్లాడుతూ.. హిందూ ద్వేషి హాస్య కళాకారుడు మునావర్​ఫారుఖీ ప్రోగ్రాం తెలంగాణలో నిర్వహించటం దుర్మార్గమన్నారు. ప్రతినిధులు తరుణ్​గౌడ్, ఎంపాల్లి  నవీన్,  రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఆర్మూర్​లో..

ఆర్మూర్ టౌన్​లోని అంబేద్కర్​ చౌరస్తా వద్ద సోమవారం విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. వీహెచ్ పీ ప్రతినిధి చరణ్ మాట్లాడుతూ.. మునావర్ ఫారుఖీ కామెడీ షో కి తెలంగాణలో పర్మిషన్​ఇచ్చి రాష్టాన్ని రావణ కాష్టం చేశారని ఆరోపించారు. నందు, రవి, నిఖిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

నిజామాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలోని ఇంటి గ్రేటెడ్​కలెక్టరేట్ బిల్డింగ్​ను సెప్టెంబర్ 5న సీఎం కేసీఆర్​ ప్రారంభించనుండడంతో ఆయన పర్యటన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు.  కలెక్టరేట్​ ప్రారంభోత్సవ ఏర్పాట్ల గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, కలెక్టరేట్ ను అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. కలెక్టరేట్​  ప్రారంభం అనంతరం గిరిరాజ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో సీఎం సభ ఉండడంతో మంత్రి సభా స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఎం సభతో ట్రాఫిక్ ​జామ్​ కాకుండా, ఒకవేళ వర్షం పడ్డా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.  అనంతరం అర్బన్​ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రశాంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, రాజేశ్వర్ రావు,  ఎమ్మెల్యేలు గణేశ్ ​బిగాల,  జీవన్ రెడ్డి, ఆర్టీసీ  చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్  డీవీ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సీపీ కేఆర్.నాగరాజు తదితరులు ఉన్నారు.

రాష్ట్రం అభివృద్ధికి  కృషి

రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. కొత్త కలెక్టరేట్​ను సీఎం కేసీఆర్​జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నారన్నారు.  అర్బన్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.  సీఎం కేసీఆర్​హైదరాబాద్ నుంచి బస్సు మార్గంలో రానున్నారని వివరించారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

లింగంపేట, వెలుగు:  నాగిరెడ్డిపేట మండలం  రాఘవపల్లి గ్రామంలో ఓ మానసిక దివ్యాంగ యువతికి ..పెళ్లైన వ్యక్తి   మాయమాటలు చెప్పి గర్భిణిని చేశాడు.  ఎస్సై ఆంజనేయులు  వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలైన యువతి (21) తల్లిదండ్రులు ఉపాధికోసం హైదరాబాద్​కు వెళ్లడంతో ఒక్కతే ఇంటి వద్ద ఉంటూ తెలిసిన వారి బర్లను మేపుతూ ఉండేది.  అదే గ్రామానికి చెందిన జూకంటి రమేశ్​(35) దివ్యాంగురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి  అత్యాచారం  చేయడంతో  యువతి గర్భం దాల్చింది. ఇటీవల హైదరాబాద్​నుంచి గ్రామానికి వచ్చిన యువతి తల్లిదండ్రులు  కూతురు గర్భవతి అని తెలుసుకుని ఆరా తీయగా రమేశ్​ బాధ్యుడు అని తేలడంతో  సోమవారం పోలీసులకు కంప్లైంట్​చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలి

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ‘ప్రజావాణి’ కి  ప్రాధాన్యమిస్తూ పెండింగ్ లో ఉన్న అర్జీలను స్పీడ్​గా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు.   కలెక్టరేట్​లోని ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్  విన్నవించి అర్జీలు సమర్పించారు.  ప్రజావాణికి 87 కంప్లైంట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల హఠాన్మరణం చెందిన  జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసులు ఫొటోకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

కామారెడ్డిలో..

కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో  భూములకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ వచ్చాయి.   అడిషనల్ కలెక్టర్​చంద్రమోహన్, కలెక్టరేట్ ఏవో రవీందర్​ఫిర్యాదులు స్వీకరించారు. 164 ఫిర్యాదులు రాగా..ఇందులో  రెవెన్యూకు సంబంధించి 140 కంప్లైంట్లు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్​ చంద్రమోహన్​ మాట్లాడుతూ..  ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు

నిజామాబాద్ టౌన్, వెలుగు:  వినాయక మండపాల నిర్వాహకులను నిబంధనల పేరుతో వేధించొద్దని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్  సూర్యనారాయణ  అన్నారు. సోమవారం నగరంలో ఏర్పాటు చేస్తున్న వివిధ మండపాల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు.  అర్బన్ నియోజకవర్గంలో సుమారు వంద మంది నిర్వాహకులకు చందా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ  శాఖల అధికారులు నిర్వాహకులను ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందన్నారు.  ఈ కార్యక్రమంలో పొతాన్కర్ లక్ష్మీ నారాయణ, నాగోళ్ల లక్ష్మీ నారాయణ, మాస్టర్ శంకర్, గోపిడి వినోద్ రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లోముందుండాలి

మాక్లూర్, వెలుగు: మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్​రావు సూచించారు.  సోమవారం మాక్లూర్ మండల సమాఖ్య 15వ మహాజన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన  హక్కులను వినియోగించుకుంటూ తల్లిదండ్రులు బాలబాలికలను బాగా చదివించాలని ఎండీవో క్రాంతి సూచించారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్​ అశోక్​ కుమార్,  ఎంపీటీసీ వెంకటేశ్వర్​ రావు, ఏపీవో అనిల్​కుమార్, మహిళా అద్యక్షురాలు సుమలత వివిధ గ్రామాల ప్రతినిధులున్నారు.