మార్చి వరకు థియేటర్లు ఓపెన్ చేయకుండా అగ్ర నిర్మాతల కుట్ర

మార్చి వరకు థియేటర్లు ఓపెన్ చేయకుండా అగ్ర నిర్మాతల కుట్ర

సినీ అగ్ర నిర్మాతలకు నిర్మాత నట్టి కుమార్ అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 25 నాటికి సినిమా థియేటర్లను రీ ఓపెన్ చేయాలన్నారు. థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చినా  కొంత మంది సినీ పెద్దలు అడ్డుకుంటున్నారన్నారు.2021 మార్చి వరకు సినిమా థియేటర్లను ఓపెన్ చేయకుండా ఐదుగురు నిర్మాతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. లీజు దారుల థియేటర్లకు విద్యుత్ బిల్లులు రద్ద చేయకూడదన్నారు. సినిమా థియేటర్లపై న్యాయపోరాటాం చేస్తామన్నారు. పెద్ద నిర్మాతలు తమ ప్రయోజనాల కోసం  థియేటర్లను మూసి ఉంచేలా కుట్ర చేస్తున్నందుకే తాను ఫిలీం చాంబర్ ఆఫ్ కామర్స్  జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశానన్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ షిప్ ను కూడా వదులుకున్నారు. వెంటనే సమావేశం నిర్వహించి వీటిపై చర్చించాలని ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ నారాయణ దాసు, సెక్రటరీ దాములను కోరారు.