సూపర్ స్టార్తో నేచురల్ స్టార్.. క్రేజీ కాంబో సెట్ చేసిన జై భీం దర్శకుడు

సూపర్ స్టార్తో నేచురల్  స్టార్.. క్రేజీ కాంబో సెట్ చేసిన జై భీం దర్శకుడు

నేచురల్ స్టార్ నాని(Nani) బంపర్ ఆఫర్ కొట్టేశారు. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కాంబోలో. ప్రస్తుతం ఈ న్యూస్ ఇటు తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో జై భీమ్(Jai Bheem) సినిమా దర్శకుడు టీజీ జ్ఞానవేల్‌(TG Gnanavel)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలర్(Jailer) సినిమా రిలీజ్ హడావుడిలో ఉన్న రజినీకాంత్ అది పూర్తవగానే టీజీ జ్ఞానవేల్‌తో సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా కథ కూడా జై భీమ్ సినిమాలాగే సోషల్ ఎలిమెంట్ తో రానుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో రజినితో పాటు మరో పాత్ర కూడా కీలకం కానుందట. అందుకోసం టాలీవుడ్ నెచురల్ స్టార్ నానిని ఎంపిక చేశారట దర్శకుడు టీజీ జ్ఞానవేల్‌. ఇప్పటికే ఈ నాని రోల్ కు సంబంధించిన కథ చర్చలు కూడా పూర్తయ్యాయని, దానికి రజినికాంత్, నాని కూడా ఒప్పుకున్నారని సమాచారం.    

ఈ న్యూస్ తెలుసుకున్న నాని ఫాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో రజినీకాంత్, నాని ఏ ఏ పాత్రల్లో కనిపించనున్నారు. వారి లుక్ ఎలా ఉంటాయి అనే అంశాలపై ఆసక్తినెలకొంది.