రెండో రోజు కొనసాగుతున్న హరిహరకృష్ణ కస్టడీ విచారణ

రెండో రోజు కొనసాగుతున్న హరిహరకృష్ణ కస్టడీ విచారణ

హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ లో ఇటీవల జరిగిన ఇంజనీరింగ్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండో రోజు కస్టడీలో ఉన్న నిందితుడు హర హర కృష్ణను ఎస్ఓటి కార్యాలయంలో విచారిస్తున్నారు. హరిహరకృష్ణ నివాసమున్న ముసారాంబాగ్ కి నిందితుడిని తీసుకెళ్లి పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో ఇతరుల ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నిందితుడి కాల్ లిస్ట్, ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. హరిహరకృష్ణ డిలీట్ చేసిన వాట్సప్ చాటింగ్ ను పోలీసులు రిట్రైవ్ చేస్తున్నారు.