గ్రేట్ సార్ : 24 ఏళ్లుగా వర్క్ ఫ్రమ్ హోం చేసిన సీఎం.. కొత్త ప్రభుత్వానికి తలనొప్పులు

గ్రేట్ సార్ : 24 ఏళ్లుగా వర్క్ ఫ్రమ్ హోం చేసిన సీఎం.. కొత్త ప్రభుత్వానికి తలనొప్పులు

ఐదేళ్లు.. పదేళ్లు లేదంటే 15 ఏళ్లు.. ఒడిశాకు ఏకంగా 24 ఏళ్లుగా సీఎంగా చేశారు నవీన్ పట్నాయక్. ఈ 24 ఏళ్లు ఆయన తన ఇంటికే క్యాంప్ ఆఫీసుగా మార్చుకున్నారు.. వర్క్ ఫ్రమ్ హోంగా. 24 ఏళ్లు సీఎంగా పరిపాలించిన చరిత్ర ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కు మాత్రమే దక్కింది. ఒడిశాలో ఇప్పుడు ప్రభుత్వం మారింది.. అధికారులకు కొత్త తలనొప్పులు వచ్చాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ ఏదీ అనే ప్రశ్న వచ్చింది.. అవును నిజమే కదా.. 24 ఏళ్లుగా సీఎంగా ఉన్న వ్యక్తి.. తన ఇంటినే ఆఫీసుగా మార్చుకుని పనులు చేశారు.. కొత్త సీఎం రావటంతో ఇప్పుడు అందరిలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.

నవీన్  పట్నాయక్ 2000లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో కాకుండా తన సొంత ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ చరిత్రలో అపూర్వమైన ఘట్టంగా మారింది.  దాదాపు 25 ఏళ్ల పాటు, అన్ని అధికారిక, పరిపాలనా పనులు నవీన్ నివాసం నుండే  నిర్వహించబడ్డాయి.  ఇప్పుడు ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో సీఎం క్యాంప్ ఆఫీస్ పై చర్చలు మొదలయ్యాయి.  కొత్త ముఖ్యమంత్రికి తాత్కాలిక వసతిగా స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఓ బంగ్లాను  సిద్ధం చేయాలని రాష్ట్ర పరిపాలన యోచిస్తోంది.

అంతకుముందు ఒడిశాకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన హేమానంద బిస్వాల్‌, జానకీ బల్లభ్‌ పట్నాయక్‌లు భువనేశ్వర్‌ క్లబ్‌ సమీపంలోని ఓ చిన్న భవనం నుంచి కార్యకలాపాలు సాగించారు. 1995లో జేబీ పట్నాయక్‌ ఎన్నికైన తర్వాత అక్కడినుంచి ఓ రెండంతస్తుల భవనంలోకి మార్చారు. పట్నాయక్‌ కుటుంబానికి చెందిన అసలైన బంగ్లా  కటక్‌లో ఉంది. నవీన్‌ పట్నాయక్‌ అక్కడే జన్మించారు. ఆ తర్వాత కొత్త రాజధాని ఏర్పడిన అనంతరం భువనేశ్వర్‌కు మకాం మార్చారు. ఆనంద్‌ భవన్‌ను ప్రస్తుతం మ్యూజియంగా తీర్చిదిద్దారు.

తొలిసారి ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 147 అసెంబ్లీ స్థానాలకు గానూ 78 స్థానాలను బీజేపీ గెలుచుకోగా,  బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.