సిద్ధు పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి

సిద్ధు పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి

‘జాతిరత్నాలు’ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రెండు తెలుగు సినిమాలతో పాటు ఓ హిందీ మూవీలోనూ నటిస్తున్నాడు నవీన్. సోమవారం నవీన్ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే సందర్భంగా ఆయా చిత్రాల కొత్త పోస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అతనికి విషెస్ చెప్పారు. అనుష్కకి జంటగా నటిస్తోన్న చిత్రంలో నవీన్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడుదల  చేశారు. ఇందులో నవీన్ పొలిశెట్టి.. సిద్ధు పొలిశెట్టిగా నటిస్తున్నాడని ప్రకటించారు.  

అంతేకాదు తను స్టాండప్ కమెడియన్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నవ్వించనున్నాడని చెప్పారు. కామెడీ టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి పేరున్న నవీన్.. హీరో అవడానికి ముందు  స్టాండప్ కమెడియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సినిమాలోనూ అదే క్యారెక్టర్ చేస్తున్నాడు. పి.మహేష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒకరోజు’ చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు నవీన్.  సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.