
చండీగఢ్: ఈ నెల 9న జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ఓపెనింగ్‌కు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజ్యోత్‌సింగ్ సిద్దూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. పంజాబ్ సీఎం అమరీందర్‌కు లెటర్ పంపారు. “ కర్తార్‌పూర్ కారిడార్ ఓపెనింగ్‌కు పాకిస్తాన్ ఆహ్వానం పంపింది. రెండు దారులను కలిపే ఈ చరిత్రాత్మకమైన రోజున గురునానక్‌కు నివాళులర్పించడం ఒక సిక్కునైన నేను అదృష్టంగా భావిస్తాను” అని సిద్దూ లెటర్‌లో పేర్కొన్నారు. కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారకు వెళ్లే మన ప్రతినిధి బృందంలో లేని పొలిటీషియన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంది. దీంతో సిద్దూ పర్మిషన్ కోసం లెటర్ రాశారు