
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఓ హరర్ చిత్రానికి ఓకే చెప్పారు. రత్నకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోగా లారెన్స్ నటించనున్నాడు. ఇద్దరికి కూడా హర్రర్ సినిమాల్లో నటించిన అనుభవం చాలానే ఉంది. లారెన్స్ కాంచన, గంగ, కాంచన3 వంటి హరర్ సిరీస్‌లో నటించాడు. నయన్ కూడా డోర, మయూరి లాంటి సినిమాలు చేసింది. వీరి కాంబోలో వస్తున్న హరర్ సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు కదా!. తొలిసారి లారెన్స్, నయన్ కలిసి నటించబోతుండడంతో సినీ ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు రత్న కుమార్ ఈ సినిమాను రూపొందించబోతున్నాడని తెలుస్తోంది.
గత ఏడాది వచ్చిన తమిళ ఇండస్ట్రీ హిట్ మూవీ విక్రమ్ కి రచన సహకారం అందించిన రత్న కుమార్ ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న లియో కు కూడా రచన సహకారం అందిస్తున్న విషయం తెల్సిందే. లోకేష్ కనగరాజ్ కు సన్నిహితుడిగా పేరున్న ఈ రత్న కుమార్ కచ్చితంగా ఈ హర్రర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మెప్పించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నయనతార మరియు లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను అతి త్వరలోనే అధికారికంగా వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.