
ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan).. తమిళ సూపర్ టాలెంటెడ్ నటుడు అండ్ దర్శకుడు. కోమాలో(Komali) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్.. ఆతరువాత హీరోగా లవ్ టుడే(Love Today) సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ప్రదీప్ రంగనాథన్ కు క్రేజ్ బాగాపెరిగింది.
అందుకే ఆయన చేస్తున్న సినిమాలపై కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ప్రదీప్ మరో కొత్త సినిమాకు ఒకే చెప్పేశారు. అయితే దర్శకుడిగా కాదు నటుడిగా.. ఆయన హీరోగా నయనతార భర్త విగ్నేష్ శివన్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలుకానుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ కు అక్కగా నయనతార చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో నయనతార, విగ్నేష్ శివన్ కాంబోలో నాందా రౌడీ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
దీంతో ఈ కొత్త సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక నాందా రౌడీ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించనున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం విగ్నేష్ శివన్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ఒక సినిమా చేయనున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయినా వెంటనే నయనతార, ప్రదీప్ రంగనాథన్ సినిమా మొదలుకానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.