
హైదరాబాద్, వెలుగు: ఎన్బీఎఫ్సీ ఇండెల్ మనీ లిమిటెడ్, రూ. 1,000 ముఖ విలువ కలిగిన సెక్యూర్డ్ ఎన్సీడీల ఆరో పబ్లిక్ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 13–28 తేదీల మధ్య ఉంటుంది. ఇందులో రూ. 150 కోట్ల బేస్ ఇష్యూ సైజ్‌తో పాటు, అదనంగా రూ. 150 కోట్ల వరకు ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ ఉంది.
మొత్తం రూ. 300 కోట్ల వరకు సమీకరించవచ్చు. ఈ ఎన్‌సీడీలకు ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ ‘ఐవీఆర్ఏ-/స్టేబుల్’ రేటింగ్ ఇచ్చింది. ఇన్వెస్టర్ల డబ్బు 72 నెలల్లో పెట్టుబడి రెట్టింపు అవుతుందని ఇండెల్మనీ తెలిపింది. ఏటా 12.25 శాతం వడ్డీ చెల్లిస్తారు. కనీసం రూ.10 వేలు ఇన్వెస్ట్ చేయాలి. ఎన్సీడీలు బీఎస్ఈ లిమిటెడ్‌లో లిస్ట్అవుతాయి.