వీడియో: మంత్రి ఇంట్లోకి ఎండ్రికాయలను వదిలారు

వీడియో: మంత్రి ఇంట్లోకి ఎండ్రికాయలను వదిలారు

మహారాష్ట్ర కు చెందిన ఓ మంత్రి ఇంట్లోకి ఎండ్రికాయలను వదిలారు  అక్కడి  విపక్ష పార్టీ  కార్యకర్తలు. మహారాష్ట్రలో మొన్న పడ్డ భారీ వర్షానికి రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యామ్ కూలిపోయింది. ఆ వరదల్లో 18మంది చనిపోయారు. ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర మంత్రి తానాజీ సావంత్. డ్యామ్ కూలడానికి ఎండ్రికాయలే కారణమని.. అవే బాధ్యత వహించాలని నిర్లక్ష్యంగా కామెంట్ చేశారు. దీంతో విపక్షాలు తానాజీ మాటలపై మండి పడ్డాయి. తాజాగా.. తానాజీ ఇంట్లోకి ఎండ్రికాయలను వదిలి నిరసన చేపట్టారు ఎన్సీపీ మహిళా విభాగపు కార్యకర్తలు.