- మోదీకి మెజార్టీ లేదు
న్యూఢిల్లీ : ఎన్డీఏ సర్కారు పొరపాటున ఏర్పడిందని, ఎప్పుడైనా పడిపోవచ్చని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీకి మెజార్టీ లేదని తెలిపారు. బీజేపీ పొత్తులను కాపాడుకునేందుకు పోరాడు తోందనే ఊహాగానాల నేపథ్యంలో ఖర్గే ఈ కామెంట్స్ చేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్డీఏది మైనార్టీ ప్రభుత్వం. ఏ సమయంలోనైనా కూలిపోవచ్చు. కానీ పూర్తికాలం కొనసాగా లని నేను కోరుకుంటున్నా”అని ఖర్గే చెప్పారు.
తాము దేశాభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తామని, దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. బీజేపీ మిత్రపక్షాలు అసంతృప్తితో ఉన్నాయని, కేంద్ర కేబినెట్ ఏర్పాటు తర్వాత ఈ విషయం బయటపడిందని ఖర్గే చెప్పారు.