దేశంలో కొత్తగా కరోనా కేసులు

దేశంలో కొత్తగా కరోనా కేసులు

భారతదేశంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. క్రమక్రమంగా కేసులు పెరుగుతున్నాయి. చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కొత్త కొత్త వేరియంట్లు ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 172 కేసులు నమోదయ్యాయి. కేరళలో ఒకరు చనిపోయారు. 24 గంటల్లో 207 మంది కోలుకున్నారు. COVID-19 రికవరీ రేటు 98.81 శాతానికి పెరిగింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,45,667 కు పెరిగింది.

మొత్తం 2,20,10,77,192 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా, సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, జపాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల కోసం RT-PCR పరీక్షను నిర్వహిస్తున్నారు. చైనాలో కరోనా కేసుల సంఖ్య అధికమౌతుండడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కోవిడ్ పరీక్షలను అధికం చేసింది.