17 వేల మంది ఇండియన్స్.. ఉక్రెయిన్ బార్డర్ దాటేసిన్రు

17 వేల మంది ఇండియన్స్.. ఉక్రెయిన్ బార్డర్ దాటేసిన్రు

న్యూఢిల్లీ: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు భారీ సంఖ్యలో భారతీయులు వెనక్కి వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. జనవరి చివరి వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 17,000 మంది ఇండియన్స్ ఉక్రెయిన్ బార్డర్ దాటేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు చెప్పింది. రానున్న 24 గంటల్లో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందుకు 15 ఫ్లైట్లు పంపనున్నట్లు ప్రకటించారు.  కీవ్లోని భారత ఎంబసీని తాత్కాలికంగా లివివ్కు తరలించాలని సూచించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని బాగ్చీ వెల్లడించారు. ఉక్రెయిన్లో పరిస్థితిపై ప్రధాని మోడీ పలు దేశాల నేతలతో నిరంతరం చర్చిస్తున్నారని అన్నారు. రష్యా దాడుల కారణంగా భారత పాస్పోర్టులు పోగొట్టుకున్న వారికి ఎమర్జెన్సీ సర్టిఫికేట్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు బాగ్చీ వెల్లడించారు.