RBI Restrictions :85% Paytm యూజర్లపై ప్రభావం ఉండదు: ఆర్బీఐ

RBI Restrictions :85% Paytm యూజర్లపై ప్రభావం ఉండదు: ఆర్బీఐ

Paytm పేమెంట్ యాప్ ని వినియోగిస్తున్న దాదాపు 80 నుంచి 85 శాతం కస్టమర్లపై ఎటువంటి  ప్రభావం ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం (మార్చి 7) వెల్లడించారు. పేటీఎం యాప్ ఇతర బ్యాంకు ఖాతాకు లింక్ చేయబడినందున వారి లావాదేవీలకు  అంతరాయం లేకుండా కొనసాగుతాయి. మరోవైపు Paytm  వాలెట్ లను ఇతర బ్యాంకులకు లింక్ చేయడానికి గడువు మార్చి 15 తో ముగియ నుంది. ఎలాంటి గడువు పొడిగింపు  అవకాశం లేదని శక్తి కాంత్ దాస్ స్పష్టం చేశారు. 

ఆర్థిక రంగంలో సురక్షితమై, స్థిరమై వృద్ది  లక్ష్యం గా ఆర్బీఐ పనిచేస్తుందన్నారు శక్తి కాంత్ దాస్. ఫిన్ టెక్ లకు ఆటంకం కలిగించకుండా స్థిరత్వాన్ని  ప్రోత్సహించాలని దాస్ అన్నారు. రెగ్యులేటరీ చర్యలు నిర్దిష్ట సంస్థలపై మాత్రమే ఉంటాయి.. అన్ని ఫిన్ టెక్ లకు కాదు.. క్రాష్ నివారించేందుకే బాధ్యతా యుతమై వృద్ధిపై దృష్టి కేంద్రీకరించామన్నారు. 

ALSO READ :- దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా..గడ్డం ప్రసాద్ను అధ్యక్షా అనాల్సిందే...

ఆర్బీఐ రెగ్యులేటరీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోవడం లేదని జనవరి 30, 2024 పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు , టాప్ అప్ లను నిషేధించింది.  మరోవైపు Paytm  వాలెట్ లను ఇతర బ్యాంకులకు లింక్ చేయడానికి గడువు మార్చి 15 కి పెంచింది. ఇకపై ఎలాంటి గడువు పొడిగింపు  అవకాశం లేదని శక్తి కాంత్ దాస్ స్పష్టం చేశారు.