నాగాలాండ్​లో తాపీ బైపోల్ 93% ఓటింగ్ నమోదు

 నాగాలాండ్​లో తాపీ బైపోల్ 93% ఓటింగ్ నమోదు

కోహిమా :  నాగాలాండ్​లోని మోన్ జిల్లా తాపీ అసెంబ్లీ నియోజకవర్గానికి మంగళవారం ఉప ఎన్నిక జరిగింది. రికార్డు స్థాయిలో 93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవా లోరిన్ ప్రకటించారు. 15,500 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు.

పొద్దున 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిందన్నారు. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్​డీపీపీ) ఎమ్మెల్యే నోక్ వాగ్నోవో ఆగస్టు 28న చనిపోయారు. దీంతో తాపీ అసెంబ్లీ సెగ్మెంట్​కు ఉప ఎన్నిక నిర్వహించారు. ఎన్​డీపీపీ తరఫున వాంగ్‌పాంగ్ కొన్యాక్, కాంగ్రెస్ తరఫున వాంగ్లేం కొన్యాక్ బరిలో ఉన్నారు.