కోహ్లీలా ఫిట్ గా ఉండే ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాలి

 కోహ్లీలా ఫిట్ గా ఉండే ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాలి

టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నప్పటి నుంచి కొత్త కెప్టెన్ పై జోరుగా చర్చ జరుగుతోంది. కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని. టీ20 ,వన్డేలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ పేరు ఈ లిస్టులో ఫస్ట్ ఉంది. కానీ కొందరు సీనియర్లు రోహిత్ ఫిట్ నెస్ ను ప్రశ్నిస్తున్నారు.లేటెస్ట్ గా భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ రోహిత్ ఫిట్ నెస్ పై సందేహం వ్యక్తం చేశాడు. టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ కు బదులుగా ప్రత్యామ్నాయం చూడాలన్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడే వారికే  టెస్టు కెప్టెన్సీని అప్పగించాలన్నాడు. కోహ్లీలా ఫిట్ గా ఉండి మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండే ప్లేయర్ కు కెప్టెన్సీ ఇవ్వాలన్నాడు.  ఎందుకంటే రోహిత్ శర్మ ప్రస్తుతం తొడ కండరాల గాయం  కారణంగా సౌతాఫ్రికా టూర్ కు దూరంగా ఉన్నాడన్నారు. భవిష్యత్తులో కూడా ఇది రిపీట్ అయ్యే చాన్స్ ఉందని..ఇలాంటిపరిస్థితుల్లో అతడికి కెప్టెన్సీ అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని సందేహం వ్యక్తం చేశాడు.

మూడు ట్రోఫీలు గెలిచిన ధోనే.. కోహ్లీ కెప్టెన్సీలో ఆడిండు

రిపబ్లిక్ డే నాడు మోడీని అడ్డుకుంటం

పంజాబ్, గోవా పైనే ఆప్ ఫోకస్