కులాల వారీ జనాభా లెక్కలు అవసరం

కులాల వారీ జనాభా లెక్కలు అవసరం

బెంగళూరు: కులాల వారీ జనగణనపై కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలె సానుకూలంగా స్పందించారు. కులాల వారీగా జనాభా లెక్కలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అథవాలె అన్నారు. తద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి సమన్యాయం అందించడం సులువవుతుందన్నారు. 

‘కులాల వారీ జనగణన చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. దీని వల్ల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రయోజనం చేకూరుతుంది’ అని అథవాలె స్పష్టం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లను కూడా పెంచాలని.. దీని వల్ల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ప్రభుత్వ స్కీముల ద్వారా మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. రిజర్వేషన్ల కోటాను 50 శాతానికి మించి పెంచొద్దని నిబంధనలు ఉన్నాయని.. కానీ సామాజిక న్యాయం కోసమైనా రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపామన్నారు.