ఆకట్టుకుంటున్న ‘కళాపురం’ సాంగ్

ఆకట్టుకుంటున్న ‘కళాపురం’ సాంగ్

పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘కళాపురం’ ఇక్కడ అందరూ కళాకారులే అనేది ఉప శీర్షిక. సత్యం రాజేశ్, చిత్రం శ్రీను, సంచిత, ప్రవీణ్ యండమూరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 26వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుధవారం సినిమాకు సంబంధించి ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నీలో ఉన్నా... ఆశలే నిన్నే మోసం చేసేలే’.. అంటూ సాంగ్ ప్రారంభమవుతుంది..ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. కామెడీ డ్రామా నేపథ్యంలో సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

కళాపురం అనే గ్రామంలో సినిమాని తెరకెక్కించాలన్న సత్యం రాజేశ్ కల నెరవేరిందా ? లేదా అనేది సినిమా చూడాల్సి ఉంటుంది. జీ స్టూడియోస్, ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘కళాపురం’కు మణిశర్మ సంగీతం అందించారు. ఎక్కడా ఎలాంటి అసభ్యత, అశ్లీలం, ద్వందార్థాలు లేకుండా క్లీన్ కామెడీతో రూపొందించామని దర్శకుడు కరుణ కుమార్ వెల్లడించారు. ఆరోగ్యవంతమైన వినోదాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో కథ రాసుకొన్నానన్నారు.