ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ అమలు చేస్తాం: నీరజ్ మిట్టల్

ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ అమలు చేస్తాం: నీరజ్ మిట్టల్

భారతదేశ టెలికాం సంస్థలో టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం కోట్ల రూపాయల ధనాన్ని సమకూర్చిందని టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్ అన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భారతదేశంలోని అనేక ప్రముఖ పరిశోధన, విద్య సంస్థలో భారతీయ టెలికాం సంస్థలోని అబ్రిడేషన్ పైన పరిశోధనలు జరుగుతున్నాయని.. పరిశోధనలు చేసే సంస్థలకు కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చామని ఆయన అన్నారు. పరిశోధనలు ఏ విధంగా సాగుతున్నాయనే దానిపై హైదరాబాద్ లోని త్రిబుల్ ఐటీ,  సంగారెడ్డిలోని ఐఐటీలను సందర్శించారు.

ఈ సంస్థ టెలికాం అబ్రిడేషన్ పైన జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. టెలికాం రంగంలో 5జీ నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరికల్లా అమలు చేస్తామని ఆయన అన్నారు. భారతదేశంలోని ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిభను టెలికాం రంగం విరివిరిగా, వినియోగించుకోనున్నదని దానిలో భాగంగానే టెలికాం రంగంలోని 5జీ అబ్రిడేషన్ పైన పరిశోధనలు చేయుటకు ఇంజనీరింగ్ కాలేజీలకు అవకాశం కల్పిస్తున్నామని సెక్రటరీ చెప్పారు. రూ. 26 వేల కోట్లను టెలికాం రంగంలో టెక్నాలజీ అప్ గ్రేడింగ్  కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు.