దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. 4 నెలల పాటు పరీక్షలను వాయిదా వేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అవుతుండటంతో.. పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది.
