ఖమ్మం జిల్లా పరిధిలో నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి

ఖమ్మం జిల్లా పరిధిలో నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు :  అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు : వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 3న నిర్వహించనున్న నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. 

గురువారం అడిషనల్ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ సాంబరాజుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఖమ్మం జిల్లా పరిధిలో నీట్ పరీక్షకు మొత్తం 2,762 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.