
మెహబూబా, గల్లీ రౌడీ చిత్రాలతో ఆకట్టు కున్న నేహా శెట్టి.. త్వరలో ‘డిజె టిల్లు’తో కలిసి వస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 12న విడుదలవుతున్న సందర్భంగా ఇలా ముచ్చటించింది. ‘‘ఈ సినిమా విషయంలో నేను చాలా ఎగ్జయిటవుతున్నాను. నా పాత్ర పేరు రాధిక. న్యూ ఏజ్ గాళ్. చాలా కాన్ఫిడెంట్‌గా, రియలిస్టిక్‌గా ఉండే అమ్మాయి. ఆ క్యారెక్టర్‌కి నేను పర్సనల్‌గా కనెక్టయ్యాను. ప్రేక్షకులు కూడా నన్ను, సినిమాని చాలా ఇష్టపడతారు. కామెడీ బాగా పండింది. స్టోరీ విన్నప్పుడే నాకు బాగా నవ్వు వచ్చింది. సిద్ధు మంచి యాక్టరే కాదు, గొప్ప రైటర్ కూడా. తన దగ్గర చాలా నేర్చుకున్నాను. ప్రిన్స్, బ్రహ్మాజీ గారు ఎప్పుడూ జోవియల్‌గా ఉంటారు. సితార లాంటి బ్యానర్‌లో నటించడం అదృష్టం. దర్శకుడు విమల్ కృష్ణ చాలా క్రియేటివ్. కామెడీ, థ్రిల్లర్, రొమాన్స్ సహా అన్ని ఎలిమెంట్స్‌తో మూవీ తీశారు. ప్రతి డైలాగ్ బాగుంటుంది. మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాను.