దశాబ్దాలుగా అసమ్మతి స్వరాలను కాంగ్రెస్ అణగదొక్కింది

దశాబ్దాలుగా అసమ్మతి స్వరాలను కాంగ్రెస్ అణగదొక్కింది

న్యూఢిల్లీ: విపక్ష కాంగ్రెస్ పార్టీపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లు వాక్ స్వేచ్ఛను అణచివేశారని, ప్రజాస్వామ్యాన్ని అడ్డదారిలో ఉంచారన్నారు. వాక్ స్వాతంత్ర్యంపై కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయాన్ని నెహ్రూ-గాంధీ కుటుంబం అగౌరవపరించిందని ఆరోపించారు. ‘వాక్ స్వేచ్ఛపై కాంగ్రెస్ ఎన్నడూ ఇతరులను ధృవీకరించలేదు. దశాబ్దాలుగా అసమ్మతి స్వరాలను కాంగ్రెస్ అణచివేసింది. ఎమర్జెన్సీ సమయంలో దీనికి ఉదాహరణలుగా నిలిచే కొన్ని ఘటనలను చూశాం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను బలహీనపరిచేందుకు యత్నించింది’ అని నడ్డా ట్వీట్ చేశారు.

పేదరికంలో పుట్టి ప్రధానిగా మారిన మోడీపై ఒక వంశం వ్యక్తిగతంగా ద్వేషాన్ని పెంచుకుంటోందంటూ నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి నడ్డా వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీపై దేశ ప్రజలు చూపిస్తున్న అపారమైన ప్రేమ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మోడీని కాంగ్రెస్ ఎంతగా విమర్శిస్తూ, అబద్ధాలు, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందో అంతగా ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తారని వివరించారు.