
న్యూఢిల్లీ: నేపాల్ మొదటిసారిగా ఇండియాకు సిమెంట్‌ఎగుమతి చేసింది. మొదటి బ్యాచ్ కింద 3,000 బస్తాలను ఆ దేశంలోని ఓ సిమెంట్ తయారీ కంపెనీ పంపింది. ఉత్తరప్రదేశ్‌లోని నేపాల్–ఇండియా బోర్డర్ నుంచి ఈ సిమెంట్ బస్తాలను పాల్పా సిమెంట్ ఇండస్ట్రీస్ ఎగుమతి చేసింది. నేపాల్ నుంచి సిమెంట్ బస్తాలను ఇండియా దిగుమతి చేసుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. నావల్‌పారాసిస్‌లోని ప్లాంట్‌లో తయారైన సిమెంట్‌ను పాల్పా సిమెంట్ ఇండియాకు ఎగుమతి చేసింది. సిమెంట్ ఎగుమతులపై అక్కడి ప్రభుత్వం సబ్సడీ ఇవ్వడంతో మరో ఐదు కంపెనీలు కూడా ఇండియాకు సిమెంట్ ఎగుమతి చేయాలని చూస్తున్నాయి.