
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీమియం మెంబర్ షిప్ అవసరం లేకుండా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ చూడొచ్చని తెలిపింది. గాడ్జెట్360 తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకుల్ని ఆకర్షించేందుకు నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ అందరూ ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో మర్డర్ మిస్టరీ, బేబీ బాస్ బ్యాక్ ఇన్ బిజినెస్, బర్డ్ బాక్స్, ది టూ పోప్స్ తో పాటు స్ట్రేంజర్ థింగ్స్, ఎలైట్, వెన్ దే సీ, లవ్ ఈజ్ బ్లైండ్, అవర్ ప్లానెట్, మరియు గ్రేస్ అండ్ ఫ్రాంకీ లను ఫ్రీగా చూడొచ్చు.
ఎవరైనా నెట్ ఫ్లిక్స్ ఒరిజనల్స్ ను వీక్షించాలంటే నెట్‌ఫ్లిక్స్.కామ్ / ఇన్ / వాచ్-ఫ్రీ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకొని నచ్చిన సినిమాను ఉచితంగా చూడొచ్చని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు తెలిపారు.
ఈ ఆఫర్ కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగారులకు మాత్రమేనని, స్మార్ట్ టీవీలు, ఫైర్ టీవీ స్టిక్ వంటి వాటిల్లో చూసేందుకు అనుమతి లేదని నెట్ ఫ్లిక్స్ తెలిపింది.